Saturday, April 19, 2025
HomeతెలంగాణKTR: బీఆర్ఎస్ సైనికులకు కేటీఆర్ సంచలన పిలుపు

KTR: బీఆర్ఎస్ సైనికులకు కేటీఆర్ సంచలన పిలుపు

బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాజ్యాంగంలో పేర్కొన్న చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను రక్షించడం అసాధ్యమన్నారు. అందుకే ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

కాగా పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్టీ పిరాయించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, డా. సంజయ్ కుమార్‌లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News