మహిళల అండర్-19 ప్రపంచకప్ (U19 Womens T20 WC)లో భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచులో మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష(Gongadi Trisha) 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడమే కాకుండా… బ్యాటింగ్‌లోనూ 33 బంతుల్లోనే 44 పరుగులు చేసి అదరగొట్టింది. దీంతో భారత్ వరుసగా రెండో సారి అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.
తాజాగా ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో నలుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. త్రిష, జి.కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ ఇందులో ఎంపికయ్యారు. ఇక సౌతాఫ్రికా క్రికెటర్ కైలా రేనెను ఈ టీమ్‌కు సారథిగా ఎంపిక చేసింది. మొత్తం 12 మందితో టీమ్‌ను వెల్లడించింది.
ఐసీసీ తుది జట్టు: కైలా రేనెకే (కెప్టెన్) (దక్షిణాఫ్రికా), గొంగడి త్రిష, జి.కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ(భారత్), జెమ్మా బోథా (దక్షిణాఫ్రికా), డేవినా పెర్రిన్ (ఇంగ్లాండ్), కావోయిమ్‌హే బ్రే (ఆస్ట్రేలియా), పూజ మహతో (నేపాల్), కేటీ జోన్స్ (వికెట్‌కీపర్) (ఇంగ్లండ్), చమోడి ప్రబోద (శ్రీలంక), న్తాబిసెంగ్ నిని (దక్షిణాఫ్రికా)