Saturday, April 19, 2025
Homeచిత్ర ప్రభMohan Babu: కలెక్టరేట్‌లో ఎదురుపడ్డ మోహన్ బాబు, మనోజ్

Mohan Babu: కలెక్టరేట్‌లో ఎదురుపడ్డ మోహన్ బాబు, మనోజ్

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు(Mohan Babu), ఆయన కుమారుడు మంచు మనోజ్(Manoj) వచ్చారు. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. బాలాపూర్‌ మండలం జల్‌పల్లి గ్రామంలో తాను ఉంటున్న ఇంట్లోకి మనోజ్‌ అక్రమంగా ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్తులు కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మంచు మనోజ్‌ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.

- Advertisement -

తాజాగా మోహన్ బాబుతో పాటు మనోజ్ కూడా మరోసారి కలెక్టరేట్‌కు వచ్చారు. తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు. కాగా ఇటీవల మంచు కుటుంబంలో వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. మనోజ్, మోహన్ బాబు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. మనోజ్ నుంచి తనకు ముప్పు ఉందని మోహన్ బాబు.. మంచు విష్ణు నుంచి తనకు ముప్పు ఉందని మనోజ్ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. తాజాగా ఈ వివాదాన్ని కలెక్టర్‌ సానుకూలంగా పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News