Monday, February 3, 2025
Homeచిత్ర ప్రభNaaNaa Hyraanaa: ‘నానా హైరానా’ ఫుల్ సాంగ్ వీడియో వచ్చేసిందోచ్

NaaNaa Hyraanaa: ‘నానా హైరానా’ ఫుల్ సాంగ్ వీడియో వచ్చేసిందోచ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్-డ్రామా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే ఈ సినిమాలోని పాటలు మాత్రం అభిమానులను అలరించాయి. శంకర్ గత సినిమాల్లో లాగే ఈ సినిమాలోని పాటల టేకింగ్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘నానా హైరానా'(Naanaa-Hyraanaa) సాంగ్ విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. ఈ పాట కోసం దాదాపు రూ.10 కోట్లు ఖర్చు పెట్టడం విశేషం.

- Advertisement -

కాగా ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలో చిత్రీకరించబడిన మొట్టమొదటి భారతీయ పాటగా ‘నానా హైరానా’ తెరకెక్కింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను కార్తీక్, శ్రేయో ఘోషల్ అద్భుతంగా పాడారు. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్‌లో అన్ని భాషలలో 60 మిలియన్లకు పైగా వ్యూస్‌తో పెద్ద హిట్ అయింది. తాజాగా ఈ సాంగ్‌ ఫుల్‌ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు చూసేయండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News