ఈనెల 13వ తేదీన జిల్లాలో చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతున్న దృష్ట్యా ఆరోజున ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో జిల్లాలోని ప్రైవేటు యాజమాన్యాలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు ఇతర సంస్థలు వారి పరిధిలో పనిచేస్తు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న ఉద్యోగులు, కార్మికులకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా అవసరం మేరకు ఆలస్యంగా కార్యాలయాలకు రావడానికి అనుమతులు, షిఫ్టుల సర్దుబాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు
ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఈనెల 13వ తేదీన ప్రత్యేక సెలవు (స్పెషల్ క్యాజువల్ లీవ్) మంజూరు చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఆ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు.
AP: చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES