ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్, కావ్య సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. రూ.2 కోట్లు ఉన్న బ్యాగ్‌ని ఇంట్లో పెట్టుకుని బ్యాంకులో రేపు కట్టేయాలని మాట్లాడుకుంటారు. అక్కడ ధాన్యలక్ష్మి, రుద్రాణిని తిడుతూ ఉంటుంది ఇంకోసారి వాళ్లు చేసే పనిలో వేలు పెట్టి నన్ను లాగి నా పరువు తీయకు అంటుంది. ఈలోగా స్వప్న వచ్చి సరిగ్గా చెప్పారు ఆంటీ ఇన్నాళ్లకు మీకు బుద్ధి వచ్చింది అంటే ఇంట్లో వాళ్లు చెప్పిన నీతులు సరిపోవా ఇప్పుడు నువ్వు చెప్పడానికి వచ్చావా అంటుంది.
నేను మీ మంచికే చెప్పడానికి వచ్చాను మీరు ఈ ఇంటికి వచ్చిన కొత్తలో మీకు ఉన్న గౌరవానికి ఇప్పుడు ఉన్న విలువకి తేడా పోల్చుకోండి అంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి ఇక్కడి నుంచి అందరూ వెళ్లిపోండి నన్ను ఒంటరిగా వదిలేయండి అంటుంది. ఆ తర్వాత రుద్రాణి దగ్గరకి రాహుల్ వచ్చి రాజ్, కావ్య వాళ్ల దగ్గర రూ.2 కోట్లు ఉన్నాయి నా కళ్లతో చూసాను అంటాడు. వెళ్లి ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పు అంటే ఈసారి వాళ్లని రెడ్ హ్యాండెడ్‌గా పట్టద్దాం అని రుద్రాణి నాటకం ఆడుతుంది.
ఉదయాన్నే రాజ్ బ్యాంకుకు వెళ్తుంటే రుద్రాణి బ్రోకర్‌తో షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్నాను అవి వాళ్ల దగ్గరే ఆ డబ్బులు తీసుకున్నాను తిరిగి ఇచ్చేయండి అంటుంది. ఆ రౌడీలు ఏమో కంగారు పెడుతుంటే రుద్రాణి, రాజ్‌ని డబ్బులు ఇవ్వమని బతిమాలుతుంది. మీరు ఏమైనా ప్లేట్ ఇడ్లీ అడుగుతున్నారా ఇవ్వడానికి రూ.2 కోట్లు ఇవ్వడం కుదరదు అంటుంది కావ్య. రుద్రాణి ఆడిన నాటకం అంతా ఫెయిల్ అయిపోతుంది. రుద్రాణి చేసిన పని గురించి రాజ్, కావ్య బ్యాంకుకు వెళ్తూ మాట్లాడుకుంటారు. రాహుల్ ఏమో ఆరూ.2 కోట్లను ఎలా అయినా కొట్టేయాలని ప్లాన్2లు వేస్తాడు ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.