జిల్లాలో ఈనెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో రానున్న 48 గంటలు చాలా కీలకమని ఆ సమయంలో ఎలాంటి రాజకీయ ప్రచారాలు జరగకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఎన్నికల అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎన్నికల అధికారి వారి క్యాంపు కార్యాలయం నుండి చిత్తూరు- నెల్లూరు-ప్రకాశం పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించని ప్రజా ప్రతినిధులు గాని, రాజకీయ నాయకులు గాని, ఇతర వ్యక్తులు కాని జిల్లాలో ఉండరాదని, జిల్లాలోని అన్ని లాడ్జీలు, హోటల్లు, ఫంక్షన్ హాల్లు, రిసార్టులను డివిజనల్ అధికారులు, పోలీసులు, ఎం.సి.సి. బృందాలు ముమ్మరంగా క్షుణ్ణంగా తనిఖీ చేసి జిల్లాకు చెందని వారిని జిల్లా బయటకు పంపించాలని అలాంటివారు జిల్లాలో ఎవరు కనపడరాదని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎక్కడ కూడా ఉల్లంఘించకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు.
ఎం.సి.సి ఉల్లంఘనలు జరిగినట్లు ఎక్కడ ఫిర్యాదులు అందరాదని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ల సేకరణ కార్యక్రమం ఈ శనివారం సాయంత్రం 5 గంటలకు ముగించాలని తదుపరి ఓటరు జాబితా మార్కుడు ప్రతులను పోలింగ్ కేంద్రాల వారిగా వేరుపరచాలన్నారు.
ఈనెల 12వ తేదీ ఆదివారం నుండి పోస్టల్ బ్యాలెట్ లను సంబంధిత ఓటర్లు నేరుగా పోస్టులో చిత్తూరులోని రిటర్నింగ్ అధికారికి పంపాల్సి ఉంటుందన్నారు.
ఈనెల 12 13 తేదీల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాలు 24 గంటలు పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని, అంబులెన్సులు సిద్ధంగా ఉండాలని, ఆరోగ్యశ్రీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
AP: గ్రాడ్యుయేట్ ఎన్నికల నిర్వహణపై టెలికాన్ఫరెన్స్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES