Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్MLC Subramanyam: కిడ్నాప్‌ వార్తలపై వైసీపీ ఎమ్మెల్సీ క్లారిటీ

MLC Subramanyam: కిడ్నాప్‌ వార్తలపై వైసీపీ ఎమ్మెల్సీ క్లారిటీ

ఏపీలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో సోమవారం జరగాల్సిన ఎన్నికను మంగళవారానికి అధికారులు వాయిదా వేశారు. కాసేపట్లో ఎన్నికకు ఓటింగ్ ఓరగాల్సి ఉండగా.. వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం(MLC Subramanyam) అదృశ్యమైనట్లు వార్తలు షికార్లు చేశాయి. తాజాగా ఈ కిడ్నాప్ వార్తలపై సుబ్రహ్మణ్యం స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

- Advertisement -

“నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. అనారోగ్యంగా కారణంగా.. ఆస్పత్రిలో చేరాను. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. వైద్యులు డిశ్చార్జ్‌ చేయగానే వస్తాను. నా ఆరోగ్యం గురించి, నేను కిడ్నాప్‌నకు గురయ్యాననే వార్తలపై ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బాగానే ఉన్నాను” అంటూ వీడియోలో పేర్కొన్నారు.

కాగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో 50మంది కార్పొరేటర్లకు గాను 47మంది ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. మొత్తం 50 మంది సభ్యులకు గాను సోమవారం ఎమ్మెల్యే ఆరణితో కలిసి 22 మందే డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరయ్యారు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లతో ఎంపీ గురుమూర్తి వెళ్తున్న బస్సుపై కూటమి నేతలు దాడి చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గత అర్థరాత్రి టీడీపీ నేత ఇంటిపై వైసీపీ యువనేత అభినయ్ రెడ్డి దాడి చేశారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి డిప్యూటీ మేయర్ ఎన్నిక తిరుపతిలో కాక రేపుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News