Tuesday, February 4, 2025
HomeఆటGongadi Trisha: హైదరాబాద్‌ చేరుకున్న త్రిషకు ఘనస్వాగతం

Gongadi Trisha: హైదరాబాద్‌ చేరుకున్న త్రిషకు ఘనస్వాగతం

మహిళల అండర్‌-19 ప్రపంచకప్‌ (U19 Womens T20 WC)లో అద్భుతంగా ఆడి భాతర్ విశ్వవిజేతగా నిలవడంలో మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష(Gongadi Trisha) కీలక పాత్ర పోషించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకుంది. టోర్నీ ముగియడంతో మలేషియా నుచి బెంగళూరు మీదుగా హైదరబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా త్రిషకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రావు ఘన స్వాగతం పలికారు . త్రిషని ఆదర్శంగా తీసుకొని మిగతా క్రికెటర్లు రాష్ట్రం నుంచి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -

ఈ సందర్భంగా త్రిష మీడియాతో మాట్లాడుతూ అండర్-19 వరల్డ్ కప్‌లో తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. భవిష్యత్తులో మరింత కష్టపడి జాతీయ మహిళా క్రికెట్ జట్టులో చోటు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానన్నారు. తన ప్రతి విజయంలో నాన్న అండగా ఉన్నారని తెలిపారు.అలాగే బీసీసీఐ, హెచ్‌సీఏ నుంచి పూర్తి మద్దతు లభించిందని పేర్కొన్నారు. మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తనకు ఇన్స్పిరేషన్ అని తెలిపారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలవడం సంతోషంగా ఉందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News