Tuesday, February 4, 2025
HomeతెలంగాణPM Modi: మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ

PM Modi: మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) సోదరి చీటి సకులమ్మ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మరణం పట్ల ప్రధాని మోదీ(PM Modi) సంతాపం ప్రకటించారు. ఈమేరకు కేసీఆర్‌కు సంతాప సందేశం పంపించారు. సోదరి మరణంతో బాధాతప్త హృదయంతో ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కష్టసమయం నుంచి త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు.

- Advertisement -

కాగా కేసీఆర్‌కు సకులమ్మ(82) ఐదో సోదరి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె స్వగ్రామం రాజన్న సరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం. ఆమె పార్థివదేహానికి కేసీఆర్‌తో సహా కేటీఆర్‌, హరీశ్ రావు, కవిత నివాళులు అర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News