గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్-డ్రామా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. నెల తిరగకుండానే ఓటీటీలోకి రావడం విశేషం. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. ఫిబ్రవరి 7 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికగా ప్రకటించింది. హిందీలో భాషలో మాత్రం కొన్ని రోజుల తర్వాత అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. దీంతో థియేటర్‌లో సినిమా మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇందులో చరణ్ సరసన అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్‌గా నటించగా.. SJ సూర్య, శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, సముద్రఖని, నవీన్ చంద్ర, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్‌లో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు నెల తిరగకుండా ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది.