పట్టణంలోని అతి పురాతన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రథసప్తమిని పురస్కరించుకొని సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామిని ఊరేగించారు. ఉదయమే స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి ప్రజలకు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. అనంతరం పురవీధులగుండా స్వామి వారి శోభాయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు.