తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి(Telangana Secretariat) బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. సచివాలయం ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్(Bomb Threat) వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించగా ఎక్కడా బాంబు లేదని తేల్చారు. ఈ క్రమంలో ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించిన SPF పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నిందితుడిని సయ్యద్ మీర్ మొహమూద్ అలీ (22)గా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.