సామాన్యులకు బంగారం ధరలు(Gold Rates) చుక్కలు చూపిస్తున్నాయి. పసిడి కొందామన్నా ఆలోచనే లేకుండా చేస్తున్నాయి. మహిళలకు ఎంతో ఇష్టమైనా బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ అందని ద్రాక్షలా మారిపోతోంది. ఇవాళ మరోసారి పుత్తడి ధరలు ఆకాశాన్ని తాకాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 950 పెరిగి.. రూ. 79,050 వద్ద అమ్ముడవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 1040 పెరిగి రూ. 86,240 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 79,200.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 86,390 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
మరోవైపు తానేమీ తక్కువనా అంటూ వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 1000 పెరిగి రూ.1,07,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో ప్రజలు బంగారం, వెండి కొనేందుకు జంకుతున్నారు.