మనలో చాలా మందికి చెవి సమస్య ఉంటుంది. చెవి లోపల దురద, ఏదో అడ్డుపడటం వంటివి తరుచు చూస్తుంటాం. దీని ద్వారా వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు వైద్యులు. దీనికి కారణం మీ చెవుల్లో పేరుకుపోయిన ధూళి కావచ్చు. చెవులలో పేరుకుపోయిన ధూళి వినికిడిని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. కొన్నిసార్లు నొప్పి లేదా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు.
మరి ముఖ్యంగా ఈ శీతాకాలంలో చెవుల లోపల మైనపు గట్టి పొర ఏర్పడుతుంది. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. తరచుగా ప్రజలు తమ చెవులను శుభ్రం చేయడానికి పదునైన వస్తువులను ఉపయోగిస్తారు. ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు. ఇది చెవులలో గాయాలు చేస్తుంది. తద్వారా చెవుడు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. కానీ ఇలాంటి సమస్యలున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇందుకు ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ చెవులను ఎటువంటి హాని లేకుండా శుభ్రం చేసుకోవచ్చుని అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం పదండి.
చెవిలో గులిమి
చెవిలో గులిమి ఏర్పడటం అనేది సహజమైన ప్రక్రియ. కానీ అది పెద్ద పరిమాణంలో పేరుకుపోయినప్పుడు అది వినికిడిని ప్రభావితం చేస్తుంది. క్లీనింగ్ కాలానుగుణంగా అవసరం, కానీ సరిగ్గా చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు.
ఇయర్ బర్డ్స్, పిన్నులు ప్రమాదం
చాలా మంది చెవులను శుభ్రం చేయడానికి ఇయర్ బడ్స్, హెయిర్‌పిన్‌లు వంటి పదునైన వస్తువులను ఉపయోగిస్తారు. ఇది చెవిపోటును దెబ్బతీస్తుందని అంటున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఇలా చేయచ్చు అని చెబుతున్నారు.
బేబీ ఆయిల్
బేబీ ఆయిల్ చెవిలో అంటుకున్న మురికిని మృదువుగా చేస్తుంది. కాబట్టి ఇది సులభంగా బయటకు వస్తుంది. రాత్రి పడుకునే ముందు చెవిలో 2-3 చుక్కలు వేసి మరుసటి రోజు ఉదయం మెల్లగా శుభ్రం చేసుకోవాలి.
బేకింగ్ సోడాను కరిగించి
“ఒక టీస్పూన్ నీటిలో బేకింగ్ సోడాను కరిగించి, చెవిలో 2-3 చుక్కలు వేయండి. కొన్ని నిమిషాల తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఇది చెవిలో గులిమిని సులభంగా తొలగించడానికి
సహాయపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
బాదం లేదా కొబ్బరి నూనె
బాదం లేదా కొబ్బరి నూనెలో సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చెవిలో చిక్కుకున్న మురికిని మృదువుగా చేస్తుంది. అంతేగాక ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.
గోరు వెచ్చని నీటితో
గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలపండి మరియు మీ చెవిలో ఉంచండి. ఇది చెవిని శుభ్రం చేయడానికి మరియు పేరుకుపోయిన మురికిని తొలగించడానికి సహాయపడుతుంది.
ఆవాలు లేదా కొబ్బరి నూనెలో వెల్లుల్లిని వేడి చేసి చల్లారిన తర్వాత చెవిలో 1-2 చుక్కలు వేయాలి. అంటువ్యాధులను నివారించడంలో మరియు చెవిని శుభ్రపరచడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చిట్కాలు ప్రయత్నించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం. మీ సమస్యను బట్టి వారిచ్చే సూచనలు పాటిస్తే చాలా మంచిదని చెబుతున్నారు.