Wednesday, February 5, 2025
Homeహెల్త్Hair care Tips: ఒత్తుగా, నల్లగా జుట్టు పెరగాలంటే ఈ ఆయిల్ చాలా బెస్ట్..!!

Hair care Tips: ఒత్తుగా, నల్లగా జుట్టు పెరగాలంటే ఈ ఆయిల్ చాలా బెస్ట్..!!

ఇప్పుడు అందర్నీ వేధించే ప్రధాన సమస్య జుట్టు రాలటం. మరి ఎన్నో హెయిర్ ఆయిల్స్ వాడిన ప్రయోజనం లేదని సమస్యతోనే చాలా మంది పోరాడుతుంటారు. అలాంటి వారికి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఈ నూనెను ఉపయోగించటం వల్ల మన జుట్టు సమస్యకు చెక్ పెట్టచ్చు. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

మనిషికి తన సహజ సౌందర్యంతో పాటు జుట్టు మరింత అందాన్ని ఇస్తుంది. నల్లటి జుట్టు, ఒత్తు అయిన జుట్టు మన అందాన్ని రెట్టింపు చేస్తోందనటంలో అతియోశక్తి లేదు. అయితే ఈ జుట్టు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే మాత్రం హెయిర్ లాస్ అవుతారని నిపుణులు చెబుతున్నారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి మనం చాలా హోం రెమెడీస్ చేస్తు ఉంటాం.ఈ హెయిర్ లాస్ నివారణకు ఆవ నూనె చాలా ఉత్తమమని నిపుణులు అంటున్నారు. దాని ఉపయోగాలేంటో తెలుసుకోండి.

- Advertisement -

*ఆవ నూనె*

ఆవనూనెను శతాబ్దాలుగా జుట్టు ఆరోగ్యానికి వాడుతూనే ఉన్నాము. జుట్టు పెరుగుదలకు ఆవాల నూనె చాలా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేటికీ ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో జుట్టుకు ఆవాల నూనెను ఉపయోగిస్తారు.


స్వచ్చమైన నూనె
కొండ ప్రాంతాల ప్రజలు ఈ నూనెను స్వచ్ఛంగా భావిస్తారు. వారు తమ జుట్టుకు మార్కెట్‌లో లభించే రసాయన ఆధారిత నూనెలను పూయడం అసలు చేయరని అంటున్నారు. ఆవనూనె పురాతన కాలం నుండి కొండ ప్రాంతాలలో ఉపయోగిస్తున్నారన్నారు. నేటికీ వేలాది జుట్టు ఉత్పత్తులలో ఈ ఆవనూనెను ఉపయోగిస్తున్నారు. ఇక్కడి ప్రజలు తమ చిన్న పిల్లలకు కూడా ఈ ఆవనూనెతోనే మసాజ్ చేస్తారు.

ఒత్తైన జుట్టుకు ఆవాల నూనె ఉత్తమం
జుట్టుకు ఆవాల నూనె ఉత్తమమైన నూనె అని బ్యూటీషియన్ ప్రేమ పరిహార్ తెలిపారు. ఇది జుట్టు మీద చాలా సులభంగా ఉపయోగించవచ్చు అన్నారు. ఈ ఆవ నూనె మన చుట్టూ సులభంగా అందుబాటులో ఉంటుంది. ఇతర నూనెలతో పోలిస్తే మస్టర్డ్ ఆయిల్ కూడా పాకెట్లలో దొరుకుతుందన్నారు.

ఇప్పుట్లో లీటరు ఆవాల నూనె రూ.180 నుంచి 200కి సులువుగా దొరుకుతుందన్నారు. ఇంత చౌకగా, స్వచ్ఛమైన రసాయనాలు లేని నూనెను జుట్టుకు రాసేందుకు మీరు కూడా ఉపయోగించండని అంటున్నారు.

*ఆవ నూనె వాడే విధానం*

బ్యూటీషియన్ ప్రేమ పరిహార్ మాట్లాడుతూ, ఆవాల నూనె రాసుకునే ముందు మీ జుట్టును సరిగ్గా దువ్వుకోవాలి. మీ వేళ్ల సహాయంతో జుట్టు మూలాలకు నూనెను అంటేలా పట్టించాలన్నారు.

మీరు రోజుకు అరగంట పాటు నూనెను అప్లై చేసి, ఆపై తల స్నానం చేయచ్చు. లేదా రాత్రి పడుకునేటప్పుడు మీ జుట్టుకు రాసుకోవచ్చు, ఇది మీ జుట్టు ఒత్తుగా మరియు బలంగా మారుతుంది. ఆవాల నూనెను అప్లై చేసిన తర్వాత జుట్టుకు సహజమైన మెరుపు వస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం, ఆవాల నూనెలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది జుట్టును బలపరుస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మస్టర్డ్ ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. ఆవాల నూనె జుట్టును మూలాల నుండి బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

జుట్టును మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది. జుట్టును హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. చుండ్రు సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా మారుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News