Wednesday, February 5, 2025
HomeఆటGongadi Trisha: త్రిషకు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Gongadi Trisha: త్రిషకు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష(Gongadi Trisha) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో త్రిష మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషను ముఖ్యమంత్రి అభినందించారు. భవిష్యత్‌లో దేశం తరఫున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం త్రిషకు ప్రభుత్వం తరపున కోటి రూపాయల భారీ నజారానా ప్రకటించారు.

- Advertisement -

అలాగే మరో టీమ్ మెంబర్ ధ్రుతి కేసరికి రూ.10లక్షలు.. టీమ్ హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి చెరో రూ.10లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం, తదితరులు ఉన్నారు.

కాగా ఈ ప్రపంచకప్‌లో త్రిష మొత్తం 309 పరుగులు చేసి సత్తా చాటింది. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ రాణించి 7 వికెట్లు తీసింది. ఆమె సొంత ప్రాంతం భద్రాచలం. తొమ్మిదేళ్ల వయసులో హైదరాబాద్ అండర్-16 జట్టులోనూ ఆడింది. అలాగే అండర్-23 కేటగిరీలోనూ ఆడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News