టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ(Abhishek Sharma) తన ఆటతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో తన దూకుడైన ఆటతీరుతో దుమ్మురేపాడు. ముఖ్యంగా ఐదో టీ20లో తుఫాన్ ఇన్నింగ్స్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ నమోదుచేసి ఔరా అనిపించాడు. ఫోర్లు, సిక్సర్లుతో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన ధనాధన్ బ్యాటింగ్‌తో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు.
తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో 829 పాయింట్లతో ఏకంగా 38 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. కేవలం బ్యాటింగ్ విభాగంలోనే కాదు.. ఆల్ రౌండర్ విభాగంలోనూ 31 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ 855 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. మరో బ్యాటర్ తిలక్ వర్మ 803 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో స్థానం దక్కించుకున్నాడు.
ఇక బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ సిరిస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్ అకీల్ హుసేన్ అగ్రస్థానంలో.. ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆరో ర్యాంక్ దక్కించుకున్నాడు.