తెలంగాణ టెట్ (TET Results) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నరసింహ రెడ్డి విడుదల చేశారు. పేపర్ 1లో 59.48 శాతం, పేపర్ 2లో 31.21 శాతం అర్హత సాధించారు. ఫలితాల్లో మొత్తం 42,384 మంది అర్హత సాధించారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించాలని పేర్కొంది. కాగా జనవరి 2 నుంచి 20 వరకు జరిగిన టెట్ పరీక్షలకు 1,35,802 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
- Advertisement -