ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో(Gannavaram Airport) దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో పలు విమాన సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. మరోవైపు గన్నవరం చేరుకోవాల్సిన విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం పొగమంచు కారణంగా అరగంటకు పైగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. అయినా సేఫ్ ల్యాండింగ్‌కి వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది.
- Advertisement -
అలాగే చెన్నై నుంచి వచ్చిన ఇండిగో విమానం, ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సైతం గాల్లోనే తిరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.