Saturday, April 19, 2025
Homeచిత్ర ప్రభBrahmanandam: విలన్‌గా బ్రహ్మానందం.. థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే

Brahmanandam: విలన్‌గా బ్రహ్మానందం.. థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే

సీనియర్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం(Brahmanandam) ఇప్పటివరకు కామెడీ, సెంటిమెంట్ పాత్రల్లో అలరించారు. అయితే త్వరలోనే విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యారు. బ్రహ్మీ కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో న‌టించిన‌ ‘బ్రహ్మా ఆనందం’ మూవీ యూనిట్ మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ త్వ‌ర‌లోనే విలన్‌గా నటిస్తానని.. ఆ విల‌నిజం థియేట‌ర్స్‌ షేక్ అయ్యేలా ఉంటుంద‌ని అన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వస్తుందన్నారు. దీంతో ఇప్పటిదాకా తన కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం.. ఇప్పుడు ఎలా భయపెడతారో అనే చర్చ మొదలైంది.

- Advertisement -

ఇక ‘బ్రహ్మా ఆనందం’ సినిమా విష‌యానికి వ‌స్తే… ఇందులో తాత -మనవడు పాత్రల్ఓ బ్రహ్మీ, గౌతమ్ నటించడం విశేషం. నూతన దర్శకుడు ఆర్‌వీఎస్‌ నిఖిల్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను నిర్మించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుద‌లైన‌ టీజర్, పాట‌ల‌కు మంచి స్పంద‌న‌ వచ్చింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News