ఈ మధ్య కొటేషన్ (quotes) ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు బైకులపై, ఆటోలపై, కారులపై ఎక్కడ చూసిన వారికి నచ్చిన కోటేషన్స్ వేసేసుకుంటున్నారు. కొంత మంది వాటిని చూసి కనెక్టు అయిపోతున్నారు. అంతేకాదు ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సాప్, త్రేడ్స్ ఇలా ఎక్కడ చూసిన మనకు నచ్చిన, మన బాధకు రిలేటేడ్ కోటేషన్స్ కనిపిస్తునే ఉంటాయి.
మరి ముఖ్యంగా చెప్పుకోలంటే ఆటోవాల కోటేషన్స్ సూపరుగా ఉంటాయి. వారి జీవితంలో జరిగిన సందర్భాలను అద్దం పట్టేలా ఆ కోటెషన్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి కోటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది మీరు చూసేయండి.
ఆ కోటేషన్ చూసిన కొందరు నిజమే భయ్యా అని అభినందిస్తున్నారు. మరి కొంత మంది ఇవి సహజమని లైట్ తీసుకుంటున్నారు. ఇందులో ఎవరి లైఫ్ కి కనెక్టుగా ఉంటాయో వారు పాజిటివ్/ నెగిటివ్ గా తీసుకుంటున్నారు. ఏదైతేనేమీ ఈ ఆటోవాలా రాసిన కోట్ యువతకు బాగా కనెక్టు కావటంతో డ్రైవర్ కి ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఇంతకు ఆ ఆటో పై కోట్స్ ఏముందంటే కూతురి బట్టల కోసం తండ్రి తన బట్టలు చింపుకున్నాడు. ప్రేమ పేరుతో అదే బట్టలను ప్రియుడి ముందు తీసేసింది ఆ కూతురు అంటూ కొటేషన్ రాయించాడు.
ఈ ఆటో వెనుక ఉన్న కొటేషన్స్ చూసి ఆ డ్రైవర్ గుణాన్ని కూడ అంచనా వేయవచ్చని అంటున్నారు ప్రయాణికులు. ఆటో వాలా వేయించిన కోటేషన్ ఉద్దేశం మనకైతే తెలీదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. సమాజంలో జరిగే ఘటనలన అద్దం పట్టేలా ఏం కొటేషన్ రాశావన్న అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఆటో వెనుక ఉన్న కోటేషన్ అందరినీ తప్పుబట్టే పరిస్థితులు లేవని అంటున్నారు. కొందరు తండ్రి ప్రేమను అర్థం చేసుకొని దేశం గర్వించదగ్గ స్థాయిలో ఎందరో కూతుర్లు ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఏమో ప్రేమించినా, పెద్దలను ఒప్పించి ప్రేమను పెళ్లి చేసుకున్నా వారున్నారని కూడ ఈ ఆటో వెనుక ఉన్న కొటేషన్ కి రిప్లై ఇస్తున్నారు.