Thursday, February 6, 2025
Homeపాలిటిక్స్Jagan: మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం హైలెట్స్..

Jagan: మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం హైలెట్స్..

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడూతూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన అబద్దాలపై మండిపడ్డారు. ఈయన చెప్పిన అబద్దాలను, మోసాలను ప్రజకు వివరిస్తామన్నారు. ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రచారం చేశారన్నారు. ఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్పా..? ముసలావిడా కూడా బటన్ నొక్కుతుందన్నారు.

సూపర్ సిక్స్ తో పాటు 143 హమీలు ఇచ్చారన్నారు. హమీలు గ్యారెంటీ అని ఇంటింటికి బాండ్లు కూడా పంచరన్నారు. అమలు చేయకపోతే చొక్కా పట్టుకోని నిలదీయండన్నారు. ఇప్పుడు 9 నెలలు తర్వాత బాబు ష్యూరీటి మోసానికి గ్యారెంటీ అని రుజువైందన్నారు. ఆ మేనిఫెస్టులు,బాండ్లు ఏమయ్యాయి అన్నారు. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలని ప్రశ్నించారు.


తప్పుల్లో రికార్డు బద్దలు

9 నెలల్లో చేసిన అప్పులు రికార్డు బద్దలు కొట్టాయన్నారు. బడ్జెటరీ అకౌంట్ అప్పులే రూ.80 వేల కోట్లు అన్నారు. అమరావతి పేరు చెప్పి రూ.52 వేల కోట్లు అప్పు చేశారన్నారు. మార్క్ ఫెడ్, సివిల్ సప్లయ్ ద్వారా మరో రూ.8 వేల కోట్లు అప్పు చేశారన్నారు. ఏపీఎండీసీ ద్వారా మరో 5 వేల కోట్లు అప్పు చేశారన్నారు. మెుత్తంగా 1 లక్ష 45 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారన్నారు. అన్ని అప్పులు చేసినా బటన్ లు నొక్కరా అని ప్రశ్నించారు. పేదలకు ఏమైన ఇచ్చారన్నారు. 1,40,000 వేల కోట్లు ఎవరి జేటులోకి వెళ్లాయన్నారు.

చంద్రబాబు సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై మండిపడ్డారు. ఇసుక, బెల్టుషాపుల గురించి ప్రస్తావించారు జగన్. సూపర్ 6 లేదు.. సూపర్ 7 లేదంటూ ప్రస్తావించారు. చీటింగ్‌లో సీఎం చంద్రబాబు పీహెచ్‌డీ చేశారంటూ ఎద్దేవా చేశారు. ఆయన వ్యవహారశైలి వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఆవిరవుతోంది. నటనలో ఆయనకు అవార్డు ఇవ్వాల్సిందేనన్నారు.


ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు కానీ 2 లక్షలకు పైగా వాలంటీర్ల ఉద్యోగాలు తీసేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్ని కూడా ఇతర శాఖల్లో సర్దేస్తున్నారు. వాలంటీర్లను ఎలా మోసం చేశారో ఉద్యోగుల్ని అలాగే మోసం చేస్తున్నారని జగన్ అన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News