ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్(IND vs ENG)టాస్ ఓడిపోయింది. ఈ మ్యాచుకు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Kohli) దూరమయ్యారు. మోకాలి గాయం కారణంగా కోహ్లీకి జట్టులో స్థానం దక్కలేదు. ఇక కోహ్లీ స్థానంలో యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ వన్డేల్లో అరంగేంట్రం చేస్తున్నాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా డెబ్యూ ఆటగాడిగా బరిలో దిగుతున్నాడు. కాగా ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.
భారత్ జట్టు: రోహిత్(కెప్టెన్), జైశ్వాల్, గిల్,శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్ దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ
ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్), బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, లివింగ్ స్టన్, బెతెల్, కార్స్, అదిల్ రషీద్, సకీబ్, జోఫ్రా ఆర్చర్