Thursday, February 6, 2025
HomeతెలంగాణKTR: కేంద్ర మంత్రులతో కేటీఆర్ వరుస భేటీలు

KTR: కేంద్ర మంత్రులతో కేటీఆర్ వరుస భేటీలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. జాతీయ రహదారి 368B సూర్యాపేట నుండి సిరిసిల్ల వరకు వేములవాడ నుండి కోరుట్ల వరకు విస్తరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. విస్తరణ వల్ల ఈ రహదారి వెంబడి ఉన్న వేములవాడ, కొండగట్టు, ధర్మపురి వంటి ప్రముఖ దేవాలయాలు మరింత అనుసంధానమవుతాయని తెలిపారు. అలాగే నేషనల్ హైవే 63కి అనుసంధానం కలుగుతుందన్నారు. మానేరు నదిపై రోడ్డు-కమ్-రైల్ బ్రిడ్జి నిర్మించాలని గడ్కరీని కేటీఆర్ బృందం కోరింది.

- Advertisement -

అంతకుముందు యూజీసీ కొత్త నిబంధనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కేటీఆర్ కలిశౄరు. ఈ నిబంధనల వల్ల మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, నిబంధనలు సవరించి రాష్ట్ర విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌తో పాటు కేంద్రమంత్రులను కలిసిన వారిలో బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News