Thursday, February 6, 2025
Homeచిత్ర ప్రభTelugu Film Chamber: ప్రతి ఏటా అవార్డులు.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం

Telugu Film Chamber: ప్రతి ఏటా అవార్డులు.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ తరపున అవార్డులు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఫిబ్రవరి 6న ఫిల్మ్ ఛాంబర్‌లో తెలుగు సినిమా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటులు మురళీమోహన్ , రచయిత పరిచూరి గోపాలకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, రచయిత జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఫిబ్రవరి 6వ తేదీని తెలుగు సినిమా దినోత్సవంగా ఛాంబర్ ప్రకటించింది. ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని తెలిపారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయించారు. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News