Thursday, February 6, 2025

ఈరోజు ఎపిసోడ్‌లో శౌర్యను చూడటానికి రూమ్‌లోకి వెళ్లిన దీప, కార్తిక్ వెళ్తే అప్పుడు శౌర్య నాకు ఏమైంది ఈ బట్టలు వేసారు ఏంటి అని అడుగుతుంది. నీకు ఏమి కాలేదు ఇంకెప్పుడు కళ్లు తిరిగి పడవు అంటాడు కార్తిక్. దీప బాధపడుతుంటే శౌర్య అడుగుతుంది దానికి ఎప్పుడు గెంతుతూ ఆడుకునే పిల్ల ఇలా ఉంటే బాధగా ఉండదా అంటుంది దీప. ఈలేగా డాక్టర్ వచ్చి ఇంకో వారం ఇక్కడే ఉండాలి అంటాడు. అమ్మ ఉంటే ఉంటాను అంటుంది శౌర్య. అలా వారం రోజులు గడిచిపోయి శౌర్యను ఇంటికి తీసుకెళ్తారు.

- Advertisement -

ఇంటికి రాగానే బొమ్మలతో ఆడుకుంటాను అంటే ఇప్పుడే కదా వచ్చావు కొంచెం బలం వచ్చాక ఆడుకొందువు అంటే ఏడుస్తుంది శౌర్య అప్పుడు సరే నేను తెస్తాను అని కార్తిక్ బయటికి వెళ్తే అక్కడ జ్యోత్స్న ఇంట్లో జరిగేది అంతా జ్యోత్స్న చూడటం కార్తిక్ చూస్తాడు. జ్యోత్స్న వెళ్లిపోతుంటే కార్తిక్ ఫాలో అయ్యి జ్యోత్స్నను ఆపుతాడు.
ఎందుకు వచ్చావు నీకు ఏమి పని ఇక్కడ కార్తిక్ అడిగితే నాకు నువ్వు కావాలి నన్ను పెళ్లి చేసుకో అంటుంది జ్యోత్స్న. నాకు ముందే పెళ్లి అయింది అంటాడు. అయినా పర్లేదు ఎంతకైనా తెగిస్తాను నీ కోసం అంటుంది. ఆ మాటలకు కార్తిక్ అయితే నిన్ను సమాజం బజారు మనిషి అని పిలుస్తారు అని రెచ్చిపోయి తిట్టేస్తాడు. అలా జ్యోత్స్న కార్తిక్ మాటల యుద్దం చేసుకుని తాతతో చేసిన ఛాలెంజ్ గురించి గుర్తుచేసి వెళ్లిపోతాడు.

తర్వాత ఇంటికి వచ్చిన కార్తిక్‌తో హోమం చేయించాలని కాంచన చెప్తే సరే అని ఆ పనులు చూస్తాడు కార్తిక్. ఇంట్లో పూజకు దశరథ వాళ్లు వస్తే బాగున్నువాళ్లని చూడాని ఉంది అని కాంచన అనసూయతో అంటుంది ఆ మాటలు దీప విని ఎలా అయినా వాళ్లని పిలవాలని అనుకుంటుంది. శౌర్య ఆపరేషన్‌కు సుమిత్ర తన నగలు తాకట్టు పెట్టి సాయం చేసిందనే అనుమానంతో జ్యోత్స్న ఇంట్లో నగలు వెతుకుతుంది. నగలు ఇంట్లోనే ఉండటం చూసి షాక్ అవుతుంది. ఈలోగా అక్కడికి సుమిత్ర వచ్చి జ్యోత్స్నను నిలదీస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News