Thursday, February 6, 2025
Homeచిత్ర ప్రభLaila Trailer: లేడి గెటప్‌లో విశ్వక్ 'లైలా' ట్రైలర్ వచ్చేసింది..

Laila Trailer: లేడి గెటప్‌లో విశ్వక్ ‘లైలా’ ట్రైలర్ వచ్చేసింది..

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌(Vis‌hwaksen) హీరోగా నటిస్తున్న చిత్రం ‘లైలా’(Laila). రామ్‌ నారాయణ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించబోతున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే టీజర్‌తో పాటు మూడు పాటలు విడుదల చేయగా.. తాజాగా ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్.

- Advertisement -

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే మోడల్ పాత్రలో విశ్వక్ కనిపించబోతున్నాడు. ఏదో సమస్యలో ఇరుక్కోవడంతో పోలీసులు హీరోను వెతకడం మొదలుపెడతారు. దీంతో పోలీసులకు దొరకకుండా లేడీ గెటప్ వేసుకొని తిరుగుతాడు. మరి లేడీ గెటప్ వేసుకున్నాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు. అసలు ఏ సమస్యలో ఇరుక్కున్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది. అంతవరకు మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News