Saturday, April 19, 2025
HomeఆటIND vs ENG: ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

IND vs ENG: ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్‌-ఇంగ్లండ్‌(IND vs ENG) మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నాగ్‌పుర్‌ వేదికగా తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ జట్లు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ బట్లర్‌ (52), జాకబ్‌ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఫిలిప్‌ సాల్ట్‌ 43 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో అరంగేట్ర బౌలర్‌ హర్షిత్‌ రాణా తొలి మ్యాచ్‌లోనే కీలకమైన 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇక రవీంద్ర జడేజా 3 వికెట్లు.. షమి, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ తలో వికెట్ తీశారు.

- Advertisement -

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఫిల్ సాల్ట్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హర్షిత్‌ రాణా వేసిన ఆరో ఓవర్లో మూడు సిక్సులు, రెండు ఫోర్ల సాయంతో ఏకంగా 26 పరుగులు చేశారు. అయితే ఎనిమిదో ఓవర్‌లో సాల్ట్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతమైన ఫీల్డింగ్‌తో రనౌట్ చేశాడు. ఆ తర్వాత హర్షిత్ వేసిన ఓవర్లోనే డకెట్‌, హ్యారీ బ్రూక్‌ ఔట్ అయ్యారు. దీంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు నెమ్మదించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News