మన తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలో 35 డిగ్రీలకు పైగా సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. కర్నూలు జిల్లా సి. బెలగల్ లో 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వెల్లడించింది. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, ప్రకాశం జిల్లా కనిగిరిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ రోజు విశాఖలో ఉష్ణోగ్రత 23°C, గరిష్ట ఉష్ణోగ్రత 31°C ఉంటుందని అంచనా వేసింది.
ప్రొద్దుటూరు, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, కోనసీమ జిల్లా కపిలేశ్వరంలో 35.8 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో 35.7, ఏలూరు, కాకినాడలో 35.6, విజయనగరంలో 35.5, మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 35.7, బాపట్ల, తణుకులో 35.5, శ్రీకాకుళం జిల్లా పొందూరులో 35.4, తిరుపతి జిల్లా రేణిగుంటలో 35.53, పల్నాడు జిల్లా మాచర్లలో 35.4, చిత్తూరు జిల్లా నగరిలో 35.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
ఫిబ్రవరి మెుదటి వారంలోనే మార్చి నెలను తలపించేలా ఎండలు దంచి కొడుతున్నాయి. అప్పుడే వేసవి వచ్చేసిందా అని జనాలు ఉక్కపోతలతో అల్లాడుతున్నారు. ఇప్పడే ఇలా ఉంటే ముందు ముందు ఎండలు ఠారెత్తిస్తాయని భయపడుతున్నారు. తెలంగాణలో కూడా ఉష్ణోగత్రలు రేటు అధికంగా ఉంటుంది. హైదరాబాద్, ఆదిలాబాద్, భద్రాచలంలో అత్యధికంగా 35-37 మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Weather Report: ఏపీ వ్యాప్తంగా 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్న సగటు ఉష్ణోగ్రతలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES