Friday, February 7, 2025
Homeట్రేడింగ్RBI: గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ

RBI: గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ

బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా జరిగిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటును 0.25శాతం మేర తగ్గిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కొనసాగుతోందని తెలిపారు. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్ల(Interest Rates)ను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచుతూ వస్తోంది. తాజా నిర్ణయంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగొచ్చిందిత. దాదాపు ఐదేళ్ల తర్వాత రెపో రేటు 6.25 శాతానికి చేరడం గమనార్హం.

- Advertisement -

రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలు పొందుతాయి. దీని వల్ల బ్యాంకులు వినియోగదారులకు అందించే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముంది. ముఖ్యంగా గృహరుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News