కవితను 8 గంటలకు పైగా విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోమారు విచారణకు రావాలని ఆదేశించారు. ఈనెల 16వ తేదీన విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీచేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో అనుమానితురాలిగా కవిత స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలుస్తోంది.
- Advertisement -
పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. కవిత అరెస్టును ముందస్తుగా ఊహించిన పార్టీ ఇందుకు తగ్గట్టుగా శ్రేణులను ఢిల్లీకి తరలించినట్టు తెలుస్తోంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ వంటివారంతా ఢిల్లీలోనే ఉన్నారు. విచారణకు ముందు, తరువాత కూడా ఢిల్లీలోని కేసీఆర్ ఇంటికే కవిత వెళ్లారు.