Friday, February 7, 2025
HomeఆటSAT20 League: కావ్య పాప ఫుల్ హ్యాపీస్.. ముచ్చటగా మూడోసారి

SAT20 League: కావ్య పాప ఫుల్ హ్యాపీస్.. ముచ్చటగా మూడోసారి

సౌతాఫ్రికా టీ20(SAT20)లీగ్‌లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్‌(Sunrisers Eastern cape) అదరగొడుతోంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు కప్ గెలిచి దుమ్మురేపగా.. ఇప్పుడు మూడో సీజన్‌లోనూ తుది పోరులో తలపడేందుకు సిద్ధమైంది. తాజాగా సెంచూరియన్‌ వేదికగా పార్ల్ రాయల్స్‌ జట్టుతో జరిగిన క్వాలిఫైయర్2 మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ముచ్చటగా మూడోసారి తుది పోరుకు అర్హత సాధించింది. దీంతో ఈ ఫ్రాంఛైజీ యాజమాని కావ్య పాప ఫుల్ హ్యాపీగా ఉంది.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 175/4 స్కోర్ చేసింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో హెర్మాన్ రూబిన్‌ (81), ప్రిటోరియస్ (59) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో క్రెయిగ్ ఓవర్టన్, మార్క్రమ్ త‌లో వికెట్ ప‌డగొట్టారు. 176 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ ఆదిలోనే డేవిడ్ బెడింగ్‌హామ్ వికెట్‌ను కోల్పోయింది. అయితే టోనీ డి జోర్జీ(78), జోర్డాన్ హెర్మాన్(81) ద్వ‌యం రాయ‌ల్స్ బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించారు. రెండో వికెట్‌కు ఏకంగా 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ విజయంతో ముచ్చటగా మూడోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది.కాగా ఇప్ప‌టికే రెండుసార్లు SA20 టైటిల్ సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఇప్పుడు వరుసగా మూడో టైటిల్‌ను సాధించాలని పట్టుదలతో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News