అగ్రరాజ్యం అమెరికా(America)లో వరుస విమాన ప్రమాదాలు(Plane accidents) తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల వాషింగ్టన్ డీసీ విమానాశ్రయంలో రెండు విమానాలు పరస్పరం ఢీకొట్టిన ఘటనలో 64 మంది ప్రయాణికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆ ఘోర దుర్ఘటన మరువక ముందు తాజాగా అలస్కాలో 10 మందితో వెళ్తున్న ఓ విమానం అదృశ్యమైనట్లు ది అలస్కా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఇది బేరింగ్ ఎయిర్ సంస్థకు చెందిన సెస్నా 208బీ గ్రాండ్ కారవాన్ మోడల్‌గా గుర్తించారు.
అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ విమానం ఉనల్కలేట్ నుంచి నోమ్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. నార్టోన్ సౌండ్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కాగా దాదాపు వారం రోజుల క్రితం ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్ సమీపంలో విమానం కూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం విధితమే.