Friday, February 7, 2025
Homeచిత్ర ప్రభKarthika Deepam February 7th Episode: గడపకు బొట్టు పెట్టి హోమానికి ఆహ్వానించిన దీప.. శివన్నారయణ...

Karthika Deepam February 7th Episode: గడపకు బొట్టు పెట్టి హోమానికి ఆహ్వానించిన దీప.. శివన్నారయణ వస్తాడా..

ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న వాళ్ల అమ్మ నగలు చెక్ చేస్తూ దొరికిపోతుంది. సుమిత్ర జ్యోత్స్న మీద అనుమానపడుతుంది. అదే సమయానికి దీప శివన్నారయణ ఇంటికి వచ్చి గడప ముంది నుంచొని పిలుస్తుంది. దీపని చూసి అందరూ షాక్ అవుతారు. లోపలికి రావచ్చా అని అడిగితే అక్కడే ఆగు అంటాడు ముసలోడు. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పి అప్పుడు రా అని శౌర్యకు ఎలా ఉంది అని అడుగుతాడు.

- Advertisement -

దీప శౌర్య బాగానే ఉంది అంటుంది. జ్యోత్స్న మధ్యలో మాట్లాడుతుంటే శివన్నారయణ ఆపి ఇంకో ప్రశ్న అంటూ మొన్న మీ అత్త, భర్త, ఇంకో అత్త వచ్చి శాపనార్థాలు పెట్టి మాట్లాడారు మళ్లీ ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సి వస్తే గెలిచి వస్తాను అన్నాడు ఇప్పుడు నువ్వు ఇంట్లో అడుగు పెడితే కార్తిక్ ఒడిపోయాడు అనే కదా అంటాడు. సుమిత్ర అడ్డుపడి ఇప్పుడు అవన్నీ ఎందుకు లోపలికి రా అని సుమిత్ర ఆహ్వానిస్తుంది. కానీ దీప లోపలికి రాను నా భర్త మాట నా మాట ఒకటే అంటుంది.

వాళ్లు ఆ రోజు వచ్చిన సంగతి నాకు తెలియదు అంటుంది. నా కూతురిక ఒంట్లో బాలేదు అని అందరికీ తెలిసిన తర్వాతే నాకు తెలిసింది అంటుంది. మా అత్తయ్య నా కూతురికి ఆపరేషన్ మంచిగా జరగాలని మొక్కుకున్నారు అందుకే రేపు మా ఇంట్లో హోమం చేస్తున్నాము, మీ లాంటి పెద్దలు ఆశీర్వాదం దానికి కావాలి అందుకే పిలవడానికి వచ్చాను అంటుంది. అప్పుడు జ్యోత్స్న చప్పట్లు కొడుతుంది. తర్వాత డబ్బులు అడగడానికి అత్త వచ్చింది, పిలవడానికి మాత్రం దీప వచ్చింది ఇదేంటి పిలవడానికి కుడా అత్తే రావాలి అంటుంది. ఈ మాటలు అన్ని విని శివన్నారయణ అరవకుండా కూల్‌గా నాకు రావాలని ఉన్నా కార్తిక్ నన్ను అన్న మాటలకోసం నేను రాను అని చెప్పేస్తాడు.

దీప బాధపడుతూ నాకు ఎలాగో అమ్మానాన్న లేరు కనీసం కాంచన అమ్మగారిని అయినా ఒంటరి చేయకండి అలా వదిలియేకండి అంటుంది. నువ్వు పిలిస్తే సరిపోతుందా కాంచన రావాలి కదా పిలవాలి కదా అని పారిజాతం అంటుంది. శివన్నారయణ మాత్రం నువ్వు వెళ్లు మా ఇంటి నుంచి ఎవరూ రారు అని చెప్పేస్తాడు. అప్పుడు దీప బాధపడుతూ మీరు అందరూ వస్తారని అశిస్తున్నా అంటూ గడపకి బొట్టు పెట్టి అందరని రమ్మని పిలుస్తుంది. దీపని అలా చూసి సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది.

దీప వెళ్తుంటే జ్యోత్స్న ఆపి గడపకి బొట్టు పెట్టి పిలిస్తే వచ్చేస్తారని అనుకుంటున్నావా అంటే దీప మాత్రం ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇస్తుంది. నీ కూతురు ఆపరేషన్ కు డబ్బులు ఎవరు ఇచ్చారు అని అడిగితే దీప కార్తిక్ బాబు ఇచ్చారు అని సమాధానమిస్తుంది. ఆ తర్వాత దీప కావేరి దగ్గరకు వెళ్లి హోమానికి రావాలని బొట్టు పెట్టి పిలుస్తుంది. అప్పుడే ఇంటికి వచ్చిన శ్రీధర్ చూసి దీప ఇంటికి వచ్చిందేంటి అనుకుంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News