Friday, February 7, 2025
HomeతెలంగాణKTR: పల్లెల్లో మరణమృదంగం మోగుతోంది: కేటీఆర్

KTR: పల్లెల్లో మరణమృదంగం మోగుతోంది: కేటీఆర్

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్లెల్లో మరణమృదంగం మోగుతుందని ఆరోపించారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పోస్ట్ పెట్టారు.

- Advertisement -

“420 అబద్ధపు హామీల పాపం.. 420 రోజుల చేతకాని పాలన శాపం ఫలితంగా మాటలకందని మహా విషాదం. తెలంగాణ చెల్లించిన భారీ మూల్యం, 420 మంది రైతన్నల బలవన్మరణం. అసమర్థులు అధికారం పీఠమెక్కి.. అన్నదాతలను బలిపీఠం ఎక్కిస్తున్నారు. కన్నీటి సేద్యం చేయలేక, భూములున్న కర్షకులే కాదు.. కౌలు రైతులూ పిట్టల్లా రాలిపోతున్నారు. దేశానికే వెన్నుముకైన రైతులకు, కుటిల కాంగ్రెస్ పాలనలో వరుస వెన్నుపోట్లు ఓట్లనాడిచ్చిన హామీలకు లెక్కలేనన్ని తూట్లు

పదేళ్లలో పంజాబ్ రాష్ట్రానే తలదన్నే స్థాయికి తెలంగాణ. నేడు పెట్టుబడికి పత్తాలేదు.. దిగుబడికి దిక్కులేదు. రుణమాఫీని ఆగం చేసి, పెట్టుబడి సాయానికి పాతరేసి, ముంచేరోజులు తేవడంవల్లే ఈ అనర్థాలు. చలనం లేని సీఎం, బాధ్యత లేని సర్కారు వల్లే, మళ్లీ తెలంగాణ పల్లె కన్నీరుపెడుతోంది. మళ్లీ మరణమృదంగం మోగుతోందని. చేతనైతే.. ఇకనైనా సాగు సంక్షోభాన్ని తీర్చండి.. అన్నదాతల ఆత్మహత్యల పరంపరను ఆపండి. జై కిసాన్, జై తెలంగాణ” అంటూ కేటీఆర్ తెలిపారు.

https://twitter.com/KTRBRS/status/1887758139778605532
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News