మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, యాంత్రిక జీవనం కారణంగా, చాలా మంది తమకు తెలియకుండానే నిద్ర లేమి సమస్యలతో బాధపడుతున్నారు, దీనిపై అవగాహన లేకపోవటం, అందుబాటులో ఉన్న చికిత్సల గురించి కూడా తెలియకపోవటంతో అనారోగ్యంపాలవుతున్నారని స్లీప్ థెరప్యూటిక్స్ వ్యవస్థాపకురాలు, ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి అన్నారు.
అత్యాధునిక వైద్య సదుపాయాలతో
స్లీప్ థెరప్యూటిక్స్ అనేది అత్యాధునిక, ప్రత్యేక వైద్య సదుపాయాలున్న కేంద్రమని నిర్వాహకులు సగర్వంగా తెలియజేస్తున్నారు. గురక, నిద్రలేమి, పగటిపూట నిద్రపోవడం, నిద్రలో నడవడం వంటి వివిధ నిద్ర రుగ్మతలతో బాదపడుతున్న వారికీ సమగ్ర చికిత్సను అందిస్తుంది. స్లీప్ థెరప్యూటిక్స్ మొదటి బ్రాంచ్ జూబ్లీ హిల్స్ లో స్థాపించమని, తమ రెండో బ్రాంచ్ ను కూకట్పల్లి లో ప్రారంభిస్తున్నామని, ఈ తరహా సెంటర్ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది అని డాక్టర్ హర్షిణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ డాక్టర్ లోరెంజో కార్బెట్టా, బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ డాక్టర్ పియరో కాండోలి పల్మోనాలజీ నిపుణులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యక్తి ఆరోగ్యానికి నిద్ర ఎంతో కీలక పాత్రను పోషిస్తుందని, మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, అల్జీమర్స్ వంటి వ్యాధులకు నిద్ర లేమి సమస్య కారణం కావొచ్చని వారు వివరించారు. అత్యాధునిక స్లీప్ లాబొరేటరీలను కలిగి ఉన్న అత్యాధునిక స్లీప్ సెంటర్ను స్థాపించినందుకు వారు డాక్టర్ హర్షిని అభినందించారు.
ఇది ఓ సామాజిక సవాలు
నిద్రలేమి సమస్యలపై అవగాహన పెంపొందించడంతో పాటు రోజువారీ జీవితంలో ఇది చూపే గణనీయమైన ప్రభావాన్ని అందరికీ వివరించి అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యంపై ప్రచారం నిర్వహించి ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో సెంటర్ ను ప్రారంభించానని డాక్టర్ హర్షిణి అన్నారు.
అనంతరం మాజీ ఎంపీ బోయనపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ నిద్ర సమస్యల గురించి అవగాహన లేకపోవడం ఒక ప్రధాన సామాజిక సవాలుగా మిగిలిపోయిందని, అవగాహన, సాంకేతిక పురోగతి రెండింటినీ పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. నిద్ర రుగ్మతల వల్ల కలిగే సామాజిక పరిణామాలు, గురక విడాకులకు సైతం దారితీసిన సందర్భాలు, ట్రాఫిక్ ప్రమాదాలకు కూడా కారణమైందని అయన గుర్తుచేశారు.
అనంతరం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నిద్రలేమిలో ఒత్తిడి పాత్రను ఎత్తిచూపారు. అవగాహన లేకపోవడం వల్ల చాలా మందికి స్లీప్ థెరప్యూటిక్స్ సేవల గురించి తెలియదని అన్నారు. ప్రతిఒక్కరూ దీని గురించి అవగాహన పెంచుకొని దీనిబారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు. ఇప్పటికే బాధపడుతున్నవారు సరైన వైద్యం పొంది సమస్య బారి నుండి బయటపడాలని అన్నారు.
మరిన్ని వివరాలకు : 90322 13595