భారత్‌లో సినిమాలు, క్రికెట్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది తమ సినిమా స్టార్స్ తమ ఫేవరెట్ క్రికెట్ ఆడుతుంటే ఆ మజానే వేరు. కొన్నేళ్లుగా సెలబ్రెటీల క్రికెట్ లీగ్(CCL 2025) దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అభిమానులను అలరించేందుకు CCL సిద్ధమైంది. శనివారం నుంచి సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు జరగనున్న ఈ సీజన్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్లు తలపడనున్నారు.
తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ ది షేర్, ముంబై హీరోస్, భోజ్‌పురి దబాంగ్స్ జట్లు సీసీఎల్-2025 బరిలో పోటీపడతాయి. తెలుగు వారియర్స్ జట్టుకు అక్కినేని అఖిల్, చెన్నై రైనోస్‌కు ఆర్య, కర్ణాటక బుల్డోజర్స్ జట్టుకు కిచ్చ సుదీప్, ముంబై హీరోస్ సాకిబ్ సలీం, పంజాబ్ ది షేర్ సోను సూద్, భోజ్‌పురి దబాంగ్స్ మనోజ్ తివారీ, బెంగాల్ టైగర్ టీమ్‌కు జిషు సేన్ గుప్తాలు సారథులుగా వ్యవహరించనున్నారు. సీసీఎల్ 2025 సీజన్ మ్యాచ్‌లను సోనీ టెన్ 3 ఛానెల్‌తో పాటు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ యాప్‌లో లైవ్‌లో చూడొచ్చు.
CCL 2025లో తెలుగు వారియర్స్ షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 8న – కర్ణాటక బుల్డోజర్స్
ఫిబ్రవరి 14న – భోజ్‌పురి దబాంగ్స్
ఫిబ్రవరి 15న – చెన్నై రైనోస్
ఫిబ్రవరి 23న – బెంగాల్ టైగర్స్