Saturday, April 19, 2025
Homeచిత్ర ప్రభPM Modi: ప్రధాని మోడీని కలిసిన నాగార్జున కుటుంబం

PM Modi: ప్రధాని మోడీని కలిసిన నాగార్జున కుటుంబం

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna) కుటుంబం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)ని పార్లమెంట్ హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని “మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ”అనే పుస్తకాన్ని ప్రధానికి అందించారు. అనంతరం ఈ పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు.ఈ జీవిత చరిత్రను ప్రముఖ రచయిత, మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించారు. మోదీని కలిసిన వారిలో నాగచైతన్య, శోభిత, అమల, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు.

- Advertisement -

కాగా ఇటీవల “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రధాని మోదీ ఏఎన్ఆర్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. భారతీయ సినీ రంగానికి చేసిన ఆయన అందించిన విశేష సేవలను కొనియాడారు. తెలుగు సినీ పరిశ్రమను చెన్నై నుండి హైదరాబాద్‌కు తీసుకురావంతో నాగేశ్వరరావు పాత్ర అపూర్వమైనదని కొనియాడారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మహానటుడు అని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News