వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(MVV Satyanarayana)కు ఈడీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. వైజాగ్‌లో హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన రూ.44.74కోట్ల ఆస్తులను జప్తు చేశారు. ఈ భూముల విషయంలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. దీంతో ఎంవీవీతో పాటు, ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్డె బ్రహ్మాజీలు సూత్రదారులని తేల్చారు. ప్లాట్లు అమ్మి సుమారు రూ. 150 కోట్లు ఆర్జించినట్లు గుర్తించారు. ఈమేరకు ఆయా ఆస్తులను జప్తు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
కాగా విశాఖపట్నంలోని ఎండాడలో అనాథలకు సేవ చేయడానికి కేటాయించిన హయగ్రీవ భూములను ఎంవీవీతో పాటు మరికొందరు అన్యాక్రాంతం చేశారు. హయగ్రీవ ప్రాజెక్టు పేరుతో 12.51 ఎకరాల భూములను మోసపూరితంగా తీసుకున్నారని తమ నుంచి 2024, జూన్ 22న చిలుకూరు జగదీశ్వరడు దంపతులు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఎంవీవీ, జీవీ ఇళ్లు, కార్యాలయాల్లో గతేడాది అక్టోబరులో సోదాలు నిర్వహించారు. నకిలీ పత్రాలు సృష్టించే డిజిటల్ పరికరాలు సహా, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.