Friday, February 7, 2025
Homeచిత్ర ప్రభBalakrishna: బాలకృష్ణను సత్కరించిన తెలుగు సినీ ప్రముఖులు

Balakrishna: బాలకృష్ణను సత్కరించిన తెలుగు సినీ ప్రముఖులు

నట సింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna)కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు హైదరాబాద్‌లోని బాలయ్య నివాసానికి వెళ్లి ఆయనను సత్కరించారు. త్వరలోనే తెలుగు ఇండస్ట్రీ తరపును బాలయ్యను ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భరత్ భూషణ్, సెక్రటరీ కె ఎల్ దామోదర్ ప్రసాద్, కోశాధికారి తుమ్మల ప్రసన్న కుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీ కె అనుపమ్ రెడ్డి , తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్,సెక్రటరీ కె అమ్మిరాజు, కోశాధికారి వి సురేష్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ సెక్రెటరీ ఉమర్జీ అనురాధ, తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ప్రెసిడెంట్ కె అమ్మిరాజు, చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్ & తెలుగు సినీ,టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్ కుమార్, తెలుగు సినీ,టీవీ అవుట్ డోర్ యూనిట్ టెక్నిషన్స్ యూనియన్ సెక్రటరీ వి సురేష్, తెలుగు సినీ స్టంట్ డైరెక్టర్స్ & స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ కోశాధికారి రమేష్ రాజా బాలకృష్ణను సత్కరించి అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News