సిద్ధు జొన్నలగడ్డ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సిద్ధు లేటెస్ట్ మూవీ జాక్.. ఈ చిత్రాన్ని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా టీజర్‌ను సిద్ధు బర్త్‌డే ట్రీట్‌గా రిలీజ్ చేశారు. మూవీలో జాక్ పాత్రలో సిద్ధు అందరినీ సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన ఓ దొంగగా కనిపించనున్నాడని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక జాక్ చేసే పనులు, చెప్పే మాటలు అందరినీ కన్ఫ్యూజ్ చేయడంతో పాటు కామెడీని పండించే విధంగా ఉన్నాయి. ఈ మూవీలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య నటిస్తోంది.
టీజర్‌లో ఆయన పర్‌ఫార్మెన్స్ చూడగానే అర్థమవుతుంది. భాస్కర్ దర్శకత్వంలో అద్భుతమైన స్క్రీన్‌ప్లే, గ్యాగ్‌లు, కామెడీ సీన్లు ఈ టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాక్ కొంచెం క్రాక్ సినిమా ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్లను కలగలిపి రూపొందించబడినట్లు తెలుస్తోంది. సినిమా మరింత రెగ్యులర్ ప్రేక్షకులకు చేరడానికి, కుటుంబ సమేత ప్రేక్షకులను ఆకర్షించడానికి రెడీ అవుతుంది.
సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ ఓ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడని ఈ టీజర్ చెబుతోంది. ఈ సినిమాకు అచు రాజమణి సంగీతం అందించగా బివిఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. డీజే టిల్లు ఫ్రాంచైజీ సినిమాలతో సూపర్ స్టార్ అయిపోయిన సిద్ధు. ఈ మూవీతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.