టాలీవడ్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మొదటి సినిమా ఉప్పెనతోనే అలజడి సృష్టించి కుర్రాళ్లకు బేబమ్మ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
తొలి సినిమాతోనే 100 కోట్ల హీరోయిన్ అనిపించుకున్న కృతి శెట్టి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది.
ఆకర్షణీయమైన రూపంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాప్ లతో ఆఫర్లు కరువయ్యాయి.
ఆమె చేసిన కొన్ని సినిమాలు అద్భుతంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఆ సినిమాలకు దెబ్బ పడడంతో ఆమెకు ఐరన్ లెగ్ అనే ముద్రను తెచ్చాయి.
దీంతో ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న కృతి శెట్టి. ఇంస్టాగ్రామ్ లో గ్యాప్ లేకుండా వరుసగా ఆమె అందమైన ఫోటోలు షేర్ చేస్తున్నారు.
కృతి శెట్టి ప్రస్తుతం సినిమా ఆఫర్స్ తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది.
తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చెయ్యగా.. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. (Photo Credit: tollywood Star Heroine krithi shetty Instagram)