Friday, February 7, 2025
Homeహెల్త్Makeup: మేకప్ ఎక్కువసేపు ఉంచుకుంటున్నారా..? అయితే బీకేర్‌ఫుల్..!

Makeup: మేకప్ ఎక్కువసేపు ఉంచుకుంటున్నారా..? అయితే బీకేర్‌ఫుల్..!

ఒకప్పుడు మేకప్ ధనవంతులు, సినీ స్టార్స్ మాత్రమే చేసుకునేవారు.. కానీ నేడు మేకప్ వేసుకోవడం అందరికీ అటవాటైపోయింది. చాలా మంది మహిళలు అందంగా కనిపించడానికి.. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి మేకప్‌ చేసుకుంటారు. మేకప్‌ ప్రయోజనాలు ఎలా ఉన్నా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దాని వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మేకప్ వేసుకోవడమే కాదు
దానిని రిమూవ్ చేయాలో తెలియాలి. ఇక మేకప్ ఎంత సమయం వరకు ఉంచుకోవాలనే విషయంలో అవగాహన ఉండాలి. ఈ విషయంపై డెర్మటాలజిస్ట్ నిపుణులు ఏమంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

- Advertisement -

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చర్మ సమస్యలు రాకూడదంటే మేకప్‌ను సరిగ్గా రిమూవ్ చేయడం చాలా ముఖ్యం. పౌడర్లు, లిప్‌స్టిక్స్‌ సరిగా తీసేయకపోతే అవి చర్మం లోపలకి వెళ్లి, చర్మ రంధ్రాలను పూడ్చేస్తాయని తెలిపారు. దీంతో ముఖం మీద మొటిమలు వస్తాయంట. అంతేకాదు చర్మం డ్రై అయిపోతుంది, దురద మొదలవుతుంది. ఫేస్ స్కిన్‌పై ముడతలు, వృద్ధాప్య ఛాయలు ఏర్పడతాయి. చర్మంపై బ్యాక్టీరియా పెరిగి, ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. ఫేస్ క్రీమ్స్‌ వినియోగించినా సరే నిద్రపోయే ముందు శుభ్రంగా రిమూవ్ చేసుకోవాలని సూచించారు.

మేకప్ ఎంత సేపు ఉచుకోవచ్చు: రోజుకు గరిష్టంగా 10-12 గంటల వరకే మేకప్ పరిమితం చేయాలన్నారు నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 8 నుంచి 12 గంటలకు మించి మేకప్ స్కిన్‌పై ఉంచుకోకూడదని చెపుతున్నారు. అంటే ఉదయం 8 గంటలకు మేకప్ వేసుకుంటే.. రాత్రి 8 గంటల లోపు దాన్ని రిమూవ్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ సేపు ఉంచితే మొటిమలు, స్కిన్ ఇరిటేషన్ వంటి సమస్యలు వస్తాయి. స్కిన్ నేచురల్ ఆయిల్ బ్యాలెన్స్ కోల్పోయి డ్రై-స్కిన్‌కి దారి తీస్తుంది. ఇక మేకప్‌ను సక్రమంగా, పరిమిత సమయం వేసుకుంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ముఖం మీద ఉండే మచ్చలు, నల్లటి మచ్చలు కవర్ చేసుకొని అందంగా కనిపించొచ్చు.

మేకప్ విషయంలో జాగ్రత్తలు:
కొన్ని రకాల మేకప్స్‌ చర్మానికి తేమనందిస్తాయి. ఇవి చర్మాన్ని రక్షిస్తాయి. అందంగా కనిపించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే మేకప్‌కి స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుందో గమనించాలి, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే మేకప్ వాడకాన్ని తగ్గించాలి. చర్మానికి తగిన స్కిన్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. స్కిన్ డ్యామేజ్‌ను రివర్స్ చేయడానికి టిప్స్ ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు, నియాసినామైడ్ లేదా హైలురోనిక్ యాసిడ్ ఉన్న సీరమ్స్‌తో చర్మాన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెష్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్‌ తినడంతో పాటు బాగా నీరు తాగడం ద్వారా స్కిన్ డ్యామేజ్‌ రివర్స్ చేసుకోవచ్చు. వారానికి 2-3 సార్లు స్మూత్ స్క్రబ్‌తో ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేయాలి. తద్వారా మృత కణాలు తొలగిపోతాయి. AHA లేదా BHA ఉన్న క్రీమ్స్‌ కూడా వాడొచ్చు. మంచి మాయిశ్చరైజర్‌తో చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు.

నాన్-కామెడోజెనిక్ ప్రొడక్ట్స్ చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేయవు కాబట్టి డైలీ మేకప్ చేసుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్. అలానే సన్‌స్క్రీన్ వాడాలి. శుభ్రంగా ముఖం కడుక్కున్న తర్వాతే మేకప్ అప్లై చేసుకోవాలి. ఫేస్ మాస్కులతో స్కిన్ మాయిశ్చరైజ్ చేసుకున్నాక మేకప్ వాడితే మంచిది. కొద్ది రోజులు మేకప్ నుంచి స్కిన్‌కి బ్రేక్ ఇవ్వాలి. అలానే చర్మంపై మృత కారణాలు తొలగిపోయి మేకప్ బాగా పట్టేలా ఎక్స్‌ఫోలియేట్‌ చేయాలి. తేలికైన క్లీన్సర్‌తో మేకప్‌ని తొలగించాలి. తర్వాత ఫోమ్ క్లీన్సర్‌తో మళ్లీ కడగాలి. దీంతో మేకప్ పూర్తిగా తొలగిపోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News