Saturday, February 8, 2025
Homeచిత్ర ప్రభBrahmamudi February 8th Episode: బారసాల ఫంక్షన్‌లో అనామిక ఎంట్రీ.. రూ.100 కోట్ల విషయం బయటపెట్టేసింది..

Brahmamudi February 8th Episode: బారసాల ఫంక్షన్‌లో అనామిక ఎంట్రీ.. రూ.100 కోట్ల విషయం బయటపెట్టేసింది..

ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య ఇంట్లో అందరికీ గోరింటాకు పెడతాను అని పిలుస్తుంది. అపర్ణ ధాన్యలక్ష్మిని పెట్టించుకో అంటే అడిగింది ఇస్తే చాలు ఇవన్నీ అక్కర్లేదు అంటే స్వప్న తిడుతుంది. తర్వాత అప్పుని గోరింటాకు పెట్టించుకో అని ఇందిరా దేవి అంటే అలవాటు లేదు అని అంటుంది. తర్వాత కళ్యాణ్ పెట్టుకోమంటే సరే అంటుంది.

- Advertisement -

ఆ తర్వాత కావ్యకి ఇందిరా దేవి గోరింటాకు పెడుతూ స్వప్న పాపని కని బాధ్యత నెరవేర్చుకుంది. మీరు ఇద్దరూ కుడా ఆ బాధ్యతలు నెరవేర్చాలి అని అడుగుతుంది. ఈ ఇంటికి ఎలాంటి కోడళ్లు వస్తారో అనుకునే దాన్ని మీరు ఒకే ఇంటి నుంచి వచ్చి సంతోషంగా ఉంటూ మమ్మళ్ని కుడా సంతోషపెట్టండి అంటుంది. ఆ తర్వాత రాజ్ గదిలో కావ్యని వాటర్ బాటిల్ మర్తిపోయి ఇవ్వమని అడిగితే కావ్య ఇవ్వడానికి ట్రై చేస్తుంటే అప్పుడు గోరింటాకు చూసి చెప్పచ్చు గా గోరింటాకు ఉందని తనే బాటిల్ తీసుకుంటాడు.

వీపు దురద పెడుతుంటే కావ్య అవస్థలు చూడలేక రాజ్ వచ్చి గోకుతుంటే కావ్య అప్పుడు అమ్మమ్మ చెప్పింది ఏమి చేస్తారు అంటే హా నానమ్మ కోరుకుంది కాబట్టి తప్పకుండా అందరి ముందు చేస్తాను అంటాడు. దానికి కావ్య ఛీ అందరి ముందు చేస్తారా సిగ్గులేదా అంటుంది. అప్పుడు రాజ్ బారసాల గ్రాండ్‌గా చేయమని అమ్మమ్మ చెప్పిందిగా చేస్తాను అంటాడు. కావ్య మాత్రం ఓ తిట్టుకుంటూ గోరింటాకు చరిపేసుకుని తిట్టుకుంటుంది.

మరోవైపు అప్పు కళ్యాణ్ ఈ ఇంట్లో గడిపిన విషయాలు గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు. అప్పు ఏమో ఇక్కడే ఉండిపోదామా అని అడుగుతుంది. కానీ కళ్యామ్ వద్దు మా అమ్మ మారిపోయింది. ఆస్తి కోసం రోజు గొడవలు జరుగుతున్నాయి మనం ఇక్కడే ఉంటే ఆ గొడవలు ఇంకా ఎక్కువ జరుగుతాయి అంటాడు. మా అమ్మ మారాకే ఇక్కడికి వద్దాం అంటాడు. వీళ్లు కుడా పిల్లలు కోసం మాట్లాడుకుని అందరూ కలిసే వరకూ వద్దు అని అప్పు అంటుంది.

మరో సీన్‌లో రుద్రాణి అనామికకు ఫోన్ చేసి ఇంట్లో జరుగుతున్న విషయాలు అన్నీ చెప్తుంది. అన్నీ చేసేస్తా తాట తీసేస్తా అన్నావు ఏమి చేయట్లేదు అని రెచ్చగొడుతుంది. అనామిక రేపు చూస్తూ ఉండండి మీ ఇంట్లో రేపు జరిగేది చూసి మీరు షాక్ అవుతారు అంటుంది.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News