ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(Delhi Election Results) ఉత్కంఠగా సాగుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన దగ్గరి నుంచి బీజేపీ అధిక్యంలో దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్(36)ను దాటేసింది. అయితే ఇప్పటిదాకా వెనుకంజలో ఉన్న ఆప్ ఒక్కసారిగా పుంజుకుంది. ప్రస్తుతం 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇక కాంగ్రెస్ పూర్తిగా వెనుకంజలో ఉంది. ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేకపోవడంతో గమనార్హం.
మరోవైపు న్యూఢిల్లీ స్థానంలో వెనుకంజలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ముందంజలోకి వచ్చారు. అయితే కాల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిశీ మాత్రం వెనుకంజలో ఉన్నారు. జంగ్పురలో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, షాకుర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజలో ఉన్నారు. బిజ్వాసన్ స్థానంలో భాజపా అభ్యర్థి కైలాష్ గహ్లోత్, గ్రేటర్ కైలాష్‌లో ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ ముందంజలో కొనసాగుతున్నారు.