Saturday, February 8, 2025
Homeనేషనల్Delhi CM: ఢిల్లీ సీఎం రేసులో స్మృతి ఇరానీ, సుష్మ స్వరాజ కుమార్తె బాన్సురి...

Delhi CM: ఢిల్లీ సీఎం రేసులో స్మృతి ఇరానీ, సుష్మ స్వరాజ కుమార్తె బాన్సురి స్వరాజ్?

మహిళా సీఎం ఖాయమా?

ఎట్టకేలకు ఢిల్లీ అసెంబ్లీలో అధికారం చేపట్టబోతున్న బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 27 తరువాత ఢిల్లీ అసెంబ్లీ పీఠాన్ని సొంతం చేసుకోబోయే బీజేపీ నేత ఎవరన్నది సర్వత్రా ఆసక్తికలిగిస్తోంది. కాగా పర్వేష్ వర్మ, రమేష్ బిధూరి, బాన్సురి స్వరాజ్, స్మృతి ఇరానీ, దుశ్యంత్ గౌతం వంటి వారు రేసులో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

- Advertisement -

మాజీ సీఎం కుమారుడు

ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ సీఎం రేసులో ఉన్నారు. బీజేపీలో గుజ్జర్ నేతగా ఎదిగిన మాజీ ఎంపీ రమేష్ బిధూరి కూడా ఈ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం అతిషిపై పోటీ చేసిన రమేష్ బిధురి చాలా పరుష పదాలు ఉపయోగిస్తూ ఆప్ పై మాటల దాడి చేయటంలో కీలక పాత్ర పోషించారు.

బాన్సురీ స్వరాజ్

సుష్మ స్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్ కూడా సీఎం రేసులో ఉన్నారు. ఢిల్లీ తొలి ముఖ్యమంత్రిగా చాలాకాలం సేవలందించిన సుష్మ స్వరాజ్ కుమార్తెగా ఈమెకు గుర్తింపు ఉంది. ప్రముఖ లాయర్ కూడా అయిన బాన్సురి పార్టీలో పట్టు సాధించటంలో భాగంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు.

స్మృతి ఇరానీ

కేంద్ర మంత్రి కూడా అయినా స్మృతి ఇరానీ హై ప్రొఫైల్ బీజేపీ నేతగా ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారు. సాధారణంగా ఢిల్లీ సీఎం పోస్టును మహిళలకు ఇచ్చేందుకే ఇష్టపడుతుంది బీజేపీ, కాంగ్రెస్. గతంలోనూ సుష్మ స్వరాజ్, షీలా దీక్షిత్ ఢిల్లీ పాలనపై తమ ముద్రను వేయటంతో ఢిల్లీకి మరోమారు మహిళా సీఎం రావటం ఖాయమని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. కాగా వీరిలో స్మృతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

దుశ్యంత్ గౌతం

బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీగా, బీజేపీ దళిత ఫేస్ గా పేరుగాంచిన దుశ్యంత్ గౌతం కూడా ఈ రేసులో దూసుకుపోతున్నారు. కరోల్ బాగ్ నుంచి పోటీచేసిన ఈయన గతంలోనూ రాజ్యసభ ఎంపీగా పనిచేసిన విశాల రాజకీయ అనుభవమున్న నేతగా స్థానికంగా పట్టుసంపాదించారు. స్టూడెంట్ లీడర్గా పనిచేసినప్పటి నుంచీ దుశ్యంత్ తనదైన ముద్ర వేస్తూ తన సీనియారిటీని, దళిత ఇమేజ్ ను ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News