ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Delhi Election Results) బీజేపీ పూర్తి మోజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు 45కు పైగా స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు.
ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే(Anna Hazare) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతో అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని తెలిపారు. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న కేజ్రీవాల్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయని ఆరోపించారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో కేజ్రీవాల్ పరువు పోయిందని.. అందుకే ప్రజలు ఆ పార్టీని ఓడించారని వ్యాఖ్యానించారు.