సహజనటి, మహానటి టైటిల్స్ ఆమెకు ఎగ్జాట్లీ సెట్ అవుతాయి. ఆమె పేరే సుజాత. సుజాత అంటేనే అందరికీ ఆమె నవ్వు, గొంతు ఠకీమని గుర్తుకువచ్చేలా ఉంటుంది. సుజాతకు తెలుగులో ఉన్న ఫ్యాన్స్ కు లెక్కేలేదు. మీరు మీ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు, నాన్నలు, బాబాయిలు, మామయ్యలను అడగండి. ఓల్డ్ హీరోయిన్ సుజాత అంటే ఇష్టమా అని ఇక వాళ్లు బోలెడు విషయాలు చెప్పేస్తారు ఆమె యాక్షన్ గురించి.
సింపుల్ సుజాత
చాలా సింపుల్ గా స్క్రీన్ మీద కనిపిస్తారు సుజాత. హీరోయిన్ కు ఉండాల్సిన హంగూ ఆర్భాటాలు ఎందుకో ఆమెలో పెద్దగా కనిపించవు. కానీ డామినేటింగ్ యాక్షన్ చేస్తారు. ఏ హీరోతోనైనా ఆమెది మంచి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అనే ఇంప్రెషన్ ఇచ్చేలా కనిపిస్తారు. సుజాతను హీరోయిన్ గా చూడగానే మనకు తెలిసిన ఫేస్ లాగే అనిపిస్తుంది. అరె ఈమెను ఎక్కడో చూసినట్టుందే అనిపిస్తుంది. చాలా సహజంగా అనిపిస్తుంది. అంతేకాదు ఆమె అసలు పెద్ద గ్లామ్ డాల్ కానేకాదు. అయినా ఆమెలో ఏదో ఒక అప్పీల్ ఉంటుంది. ఆ అప్పీల్ చాలు ఆమె ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేందుకు.
స్టోరీస్ కూడా వెరైటీనే
మిగతా హీరోయిన్స్ తో పోల్చితే సుజాత కంప్లీట్లీ డిఫరెంట్. ఆమె సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కూడా అంతే. చాలా వెరైటీగా ఉంటాయి. మూస ధోరణిలో కొట్టుకుపోయే టైప్ హీరోయిన్ మెటీరియల్ కాదామె. అలాగే ఏ హీరోయిన్ కు తాను పోటీకాదు. తనకు తానే పోటీ అనే రేంజ్ లో ఉంటాయి ఆమె ఫిలిమ్స్. వెర్రి వేషాలు వేయదు, పిచ్చి క్యారెక్టర్స్ ఒప్పుకోదు. గ్లామ్ డాల్ గా మెరిసిపోవటం అస్సలు నచ్చదు సుజాతకు.
హోమ్లీ బ్యూటీ
స్క్రీన్ పైన చాలా హోమ్లీగా కనిపిస్తారు సుజాత. సుజాతలాంటి లైఫ్ పార్ట్నర్ ఉండాలి అనేలా ఉంటుంది ఆమె స్క్రీన్ ప్రెజెన్స్. ఇక సిస్టర్ రోల్ లో సుజాత కనిపిస్తే చెల్లి అంటే ఇలాంటి ఉండాలి. ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. సో ఆమె వేసే క్యారెక్టర్ ఏదైనా ఇట్టే ఒదిగిపోవటం ఆమె స్పెషాలిటీ అన్నమాట. ఇదే ఆమె బలం. చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు సుజాత. కానీ ఆమె సినిమాల్లో ఆమెది చాలా బలమైన వుమెన్ రోల్ కావటం ఆమె సినిమాల్లోని సక్సెస్ మంత్రా అని చెప్పాలి.
పాపం .. సినిమా కష్టాల లైఫ్
ఇక సుజాత రియల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె రియల్ లైఫ్ లో పాపం చాలా కష్టాలు పడ్డారు. సుజాత భర్త రోజూ ఆమెను వేధించేవారట. అంతేకాదు బెల్టుతో కొట్టేవారట. అంతటితో ఊరుకోని సుజాత హజ్బెండ్ ఆమెకు సినిమా ఛాన్సులు కూడా రాకుండా చేసేవారట. అంత అందమైన సుజాత జీవితంలో ఇంత విషాదం ఉందా అని షాకింగ్ గా ఉందికదూ. ఓల్డ్ జనరేషన్ హీరోయిన్స్ లో ఓ వెలుగు వెలిగిన స్టార్ ఆమె. కానీ రియల్ లైఫ్ లో మాత్రం పాపం ఇలా డొమెస్టిక్ వయలెన్స్ కు బలికాక తప్పలేదన్నమాట.
గోరింటాకు..
సుజాత అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది గోరింటాకు సినిమా. నిజానికి గోరింటాకు తెలుగులో సుజాతకు ఫస్ట్ మూవీ కూడా. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ అదరగొట్టారంటే నమ్మండి. అంతే ఇక తెలుగు డైరెక్టర్స్, హీరోస్ కు ఈమె ఫేవరెట్ అయిపోయారు. ఆతరువాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి అప్పటి టాప్ హీరోస్ అందరితోనూ ఆమె తెరపైన ఆడిపాడి అందరితో శెభాష్ అనిపించుకున్నారు.
14 ఏళ్లకే ఎంట్రీ
14 ఏళ్లకే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు సుజాత. ఆమె 1952 డిసెంబర్ 10వ తేదీన పుట్టారు. సుజాత ఫాదర్ శ్రీలంకలోని గాలే టౌన్లో జాబ్ చేసేవారు. దీంతో సుజాత శ్రీలంకలో పుట్టారు. అక్కడే పెరిగారుకూడా. ఆతరువాత వీళ్ల ఫ్యామిలీ చెన్నైకి వచ్చి సెటిల్ అయింది.
బాలచందర్ హీరోయిన్ చేశారు
1974లో డైరెక్టర్ కే బాలచందర్ ఆమెకు తెరంగేట్రం చేసే ఛాన్స్ ఇచ్చారు. సుజాత ఫస్ట్ సినిమా తమిళం సినిమా. ఇది సూపర్ హిట్ కావటంతో ఇక సుజాత కెరీర్ సూపర్ డూపర్ గా లాంచ్ అయిపోయింది. అంతే ఇక బిజీ స్టార్ గా మారిపోయారు. ఒక్కసారిగా సుజాత లోకమే మారిపోయింది. టీనేజ్ లోనే హీరోయిన్ గా లాంచ్ కావటం, ఫస్ట్ సినిమా బ్లాక్ బాస్టర్ కావటంతో సుజాతది లక్కీ హ్యాండ్ గా మారిపోయింది. సినిమావాళ్ల లెక్కలు, ఆలోచనలు, సెంటిమెంట్స్ ఇలాగే ఉంటాయిగా. ఇదే కలిసొచ్చింది ఆమెకు.
బాక్సాఫీస్ హిట్స్
ఆతరువాత తమిళ్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్, జెమిని గణేషణ్ లాంటి హీరోలతో ఆమె స్క్రీన్ పైన జతకట్టారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించాయి. అంటే టాప్ హీరోలతో యాక్ట్ చేసి, ఆమెకూడా టాప్ హీరోయిన్ గా ఎదిగారన్నమాట. అప్పట్లో దాదాపు ప్రతి టాప్ హీరోయిన్ ప్యాన్ ఇండియా స్టార్ అనే చెప్పాలి. సుజాత కూడా అంతే. ప్యాన్ ఇండియా హీరోయిన్. తెలుగు, తమిళ్, కన్నడ లాంగ్వేజెస్ లో ఆమె చాలాసినిమాల్లో హీరోయిన్ గా చేశారు. టోటల్ గా 3వందలకు పైగా సినిమాల్లో సుజాత యాక్ట్ చేశారు. తెలుగులో శ్రీరామదాసులో లాస్ట్ టైం మనం సుజాతను సిల్వర్ స్క్రీన్ పైన చూశాం.
ఇంటి ఓనర్ కొడుకుతో ప్రేమ..
హీరోయిన్ గా ఆమె కెరీర్ చాలా బిజీగా ఉంది. ఇటు తెలుగు.. అటు తమిళ్, ఇంకోవైపు కన్నడ సినిమాల్లో బిజీ షెడ్యూల్స్ మధ్య లైఫ్ సాగుతోంది. ఈ టైంలోనే ఆమె తన ఇంటి ఓనర్ కొడుకు జయకర్ తో ప్రేమలో పడ్డారు. అంతే ఒక్కసారి కూడా ఆమె అతనితో తనకు కంపాటబిలిటీ ఉంటుందా లేదా అని పెద్దగా ఆలోచించకుండానే మ్యారేజ్ కూడా చేసేసుకున్నారు.
వీరి ఫ్యామిలీ విషయానికి వస్తే, సుజాత-జయకర్ కు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇక పెళ్లై పిల్లలు పుట్టాక ఆమె అమెరికా వెళ్లిపోయారు. కానీ అమెరికా క్లైమేట్ సూట్ కాక ఇబ్బందిపడ్డారు సుజాత. ఆతరువాత కొంతకాలానికి ఇండియాకు రిటర్న్ వచ్చారు. అంతేకాదు సుజాత ఇండియా వచ్చాక మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు అవసరమైన ఆఫర్స్ ఆమెకు క్యూ కట్టాయి. సో మళ్లీ స్క్రీన్ పైన సుజాత ఏదో ఒక క్యారెక్టర్ లో కనిపించటం స్టార్ట్ అయింది.
భర్తతో టెన్షన్
కానీ సుజాతకు తన భర్త జయకర్ సపోర్ట్ లేకపోవటంతో చాలా టెన్షన్స్ పడ్డారు. ఒక్కోసారి షూటింగ్ స్పాట్ కే వచ్చి సుజాతను అతను కొట్టేవాడని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి కూడా. అంతేకాదు ఇంటికి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు వాళ్లు సుజాత కాల్ షీట్స్ అడిగితే, జయకర్ ఇంటర్ఫియర్ అయిపోయి బోలెడు కండిషన్స్ పెట్టేవాడట. ఇప్పుడు మీకు అర్థమైందా సినిమాల్లో ఆమె కన్నీరు ఎలా కార్చేదో. రియల్ లైఫ్ లోకూడా అలానే ఏడ్చాల్సి వచ్చేదని. సో రీల్ లైఫ్ కష్టాలే కాదు రియల్ లైఫ్లోనూ కష్టాలు ఆమెను వెంబడించాయి.
5 దశాబ్దాలు అలరించిన నటి
నాటి హీరోయిన్స్ లో ఆమె మేటి నటిగా పాపులర్ అయ్యారు. హీరోయిన్ గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఆమె కెరీర్ కంటిన్యూ చేశారు. 50 ఏళ్లు అంటే ఫైవ్ డికేడ్స్ ఆమె మనల్ని ఎంటర్ టైన్ చేశారు. ఆమె ఒక స్టేజ్ లో ఎంత బిజీ ఆర్టిస్టో చెప్పాలంటే జస్ట్ 7 ఏళ్ల టైంలో ఏకంగా 40 సినిమాల్లో హీరోయిన్ గా ఆమె యాక్ట్ చేశారు. అది కూడా వేరియస్ లాంగ్వేజెస్ లో. అంటే హీరోయిన్ గా సుజాత్ రేంజ్ ఏంటో చెప్పేందుకు ఇదొక్క విషయం చాలన్నమాట. చెన్నైలో ఉంటున్న సుజాత 2011లో బాగా సిక్ అయ్యారు. ఆతరువాత ఆమె శాశ్వతంగా కన్నుమూశారు.
మాతృభాష మళయాళం
మళయాళం, హిందీ సినిమాల్లోనూ తన సత్తా చాటిన సుజాత శ్రీలంకలోని మళయాళీల ఫ్యామిలీలో పుట్టారు. చాలామంది ఆమె మదర్ టంగ్ తమిళం అనుకుంటారు. ఆమె కుటుంబం కేరళ నుంచి వచ్చింది సో సుజాత మదర్ టంగ్ మళయాళం. 70ల్లో ఆమె టాప్ హీరోయిన్. అది కూడా అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో అంటే ఆశ్చర్యంగా ఉందా. అలాంటి సుజాత 80ల్లోనే అమ్మమ్మ, నాన్నమ్మ రోల్స్ కు షిఫ్ట్ అయిపోయారు. రజనీకాంత వంటి హీరోలకు హీరోయిన్ గా వేసిన సుజాత, బాబా వంటి సినిమాల్లో రజనీకాంత్ కు తల్లి క్యారెక్టర్ ప్లే చేయటం మరో ఇంట్రెస్టింగ్ విషయం. హీరోయిన్స్ కెరీర్ ఎంత షార్ట్ గా ఉంటోందో చెప్పేందుకు సుజాత ఫిల్మీ కెరీర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తోంది కదూ.
మూడుసార్లు బెస్ట్ యాక్ట్రెస్
తమిళంలో మూడుసార్లు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకున్న సుజాత తెలుగులోనూ గుప్పెడు మనసు సినిమాలో యాక్షన్ కు గానూ బెస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. పెళ్లి సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డ్ అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే ప్రెస్టీజియస్ కలైమామణి అవార్డు అందుకున్నారు. స్పెషల్ బెస్ట్ యాక్ట్రెస్ అనే తమిళ్ నాడు గవర్నమెంట్ అవార్డును కూడా అందుకున్నారు సుజాత.
ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ లేదు
ఏదో గాలివాటంగా సినిమా ఇండస్ట్రీలోకి సుజాత వచ్చారు. అంతేకానీ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆమె ఏనాడు ట్రై చేయలేదు, ఇంట్రెస్ట్ చూపలేదు. సుజాత ఫ్యామిలీలో ఫిలిం ఇండస్ట్రీకి చెందినవారెవ్వరూ లేరు. మరోవైపు సినిమాల్లో ఎన్ని ఛాన్సులు వచ్చినా ఆమె తన మనసుకు నచ్చిన రోల్స్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుని యాక్ట్ చేశారు. ఎందుకో ఆమె ఫిలిం ఇండస్ట్రీలో ఇమడలేకపోయారు. సినిమావాళ్ల రీల్ అండ్ రియల్ లైఫ్ ఆమెకు నచ్చలేదు. అంటీముట్టనట్టుగానే ఇండస్ట్రీలో ఆమె ఉండేవారు. తన కో యాక్టర్స్ తో ఆమె చాలా పద్ధతిగా ఉండేవారు. సుజాతకు ఇండస్ట్రీలో మంచి పేరుండటమే కాదు ఆమెకు గౌరవం కూడా బాగా ఇచ్చేవారు. చాలా లో ప్రొఫైల్ లో ఉంటూ ఫిలిం ఇండస్ట్రీలోని కాంట్రవర్సీస్ కు ఎప్పుడూ ఆమె దూరంగానే ఉంటూవచ్చారు. చాలా పెద్ద బ్యానర్స్ లో వచ్చిన ఛాన్సులు కూడా ఆమెకు క్యారెక్టర్ నచ్చక రిజెక్ట్ చేశారు. అందుకే ఆమెకు దక్కాల్సిన పూర్తి స్టార్ డం దక్కలేదు. ఎమోషనల్ క్యారెక్టర్స్ ను ఎక్కువగా ఇష్టపడి చేసిన సుజాత స్కిన్ షోకు దూరంగా ఉండేవారు.