ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Delhi Election Results)పై ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Kejriwal) స్పందించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని ఓ వీడియో విడుదల చేశారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని తెలిపారు. గత పదేళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని.. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం చాలా కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆప్ విజయం కోసం పోరాడిన ఆప్ నేతలు, కార్యకర్తలకూ కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా.. ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఖాతా కూడా తెవరలేదు.